టీపీటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షునిగా నీలి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్
మునిపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): టీపీటీఎఫ్ మునిపల్లి మండల నూతన కమిటీ(TPTF Munipally Mandal Committee)ని మంగళవారం మండలంలోని పెద్ద గోపులారం జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో రాష్ట్ర కౌన్సిలర్ భాస్కర్ సమక్షంలో ఎన్నుకున్నారు.
సంఘం మండల అధ్యక్షునిగా నీలి లక్ష్మణ్ (ప్రాథమిక పాఠశాల అల్లాపూర్), మండల ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ (ప్రాథమిక పాఠశాల ఇబ్రహీంపూర్), జిల్లా కౌన్సిలర్లుగా గోవర్ధన్ (ఎంపీ యుపిఎస్ - పోల్కంపల్లి, ముజాఫర్‌ఉద్దీన్ (జడ్పిహెచ్ఎస్ - బుధేరా), సంతోషమ్మ – ఎంపీపీ ఎస్ కంకోల్, అమీన్‌ఉద్దీన్ –ఎంపీయుపిఎస్ లింగంపల్లి, నాగేశ్వర్ జడ్.పి.హెచ్.ఎస్ పెద్ద గోపులారంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంఘ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ తోటి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.