పాఠశాలలో ఎన్నికల కోలాహలం..!

11-11-2026 | 06:05pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM Shri Zilla Parishad High School)లో విద్యార్థుల నుండి హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కొరకు ఎన్నికలు నిర్వహించారు. అచ్చు సాధారణ ఎన్నికల మాదిరిగానే పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం స్టేషన్ లో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని అటువంటి ఉద్దేశంతోటి  పాఠశాలలో సాధారణ ఎన్నికల ను పోలినటువంటి విధంగా నమూనా ఎన్నికలను నిర్వహించారు.

విద్యార్థులంతా తమకు నచ్చిన విద్యార్థి నేతలను బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నారు. హెచ్ఎం పెరుగు శ్రీవిద్య మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో హెడ్ బాయి గా గెలుపొందిన మారోజు నితీష్, హెడ్ గర్ల్ గా తండా లావణ్యలు పాఠశాల అభివృద్ధిలో పాఠశాల క్రమశిక్షణలో పాలుపంచుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు