పాల్వంచ పట్టణంలో తీవ్ర కలకలం..

14-10-2026 | 10:31pm

ఓడ్డుగూడెంలో వీధి కుక్కల బీభత్సం

ఏడుగురిపై విచక్షణారహితంగా దాడి

తీవ్ర గాయాలతో ఆందోళనలో స్థానికులు

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెం ప్రాంతంలో వీధి కుక్కలు(Street Dog) రెచ్చిపోయాయి. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పిచ్చి కుక్కలు ఒక్కసారిగా స్థానికులపై బుధవారం విరుచుకుపడ్డాయి. బుధవారం రాత్రి ఈ వరుస దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  

​అకస్మాత్తుగా కుక్కలు దాడి చేయడంతో స్థానికులుబి భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై, ఇళ్ల ముందు ఉన్న వారిపై కుక్కలు సామూహికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడిలో గాయపడిన బాధితుల్లో ఒకరి చేతికి, శరీరంపై తీవ్ర గాయాలైన దృశ్యాలు స్థానికంగా భయాందోళనలను రేకెత్తించాయి. 

​పాల్వంచ పట్టణంలో రోజురోజుకూ వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోతోందని, చిన్న పిల్లలు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి, వీధి కుక్కల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు ప్రభుత్వపరంగా సాయం అందించాలని కోరుతున్నారు.

​

మరిన్ని వార్తలు