వీబీజీ రామ్‌జీ పథకంపై మేట్లకు శిక్షణ
375 రకాల పనులపై అవగాహన
కరువును ఎదుర్కొనేలా కార్యాచరణ
టేకులపల్లి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మండలంలోని బోడు రైతు వేదికలో 12 గ్రామపంచాయతీల పరిధిలో వీబీజీ రామ్‌జీ (VB-G RAMG) పథకం కింద పనిచేస్తున్న 55 మంది మేట్లకు శుక్రవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేట్ల విధులు, బాధ్యతలు, నూతన పథకంలో చోటుచేసుకున్న మార్పులు, 375 రకాల పనులపై అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామాల్లో ఉపాధి పనులను సమర్థంగా చేపట్టాలని సూచించారు.
ప్రతి గ్రామపంచాయతీలో 80 మంది కూలీలతో పనులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. జల సంరక్షణలో భాగంగా మ్యాజిక్ సోక్‌పిట్లు, ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, ఊటకుంటల ఏర్పాటుపై వివరించారు. ప్రతి కుటుంబానికి రోజుకు రూ.308 కూలీ చొప్పున, ఆర్థిక సంవత్సరంలో రూ.38,500 వరకు లబ్ధి చేకూరేలా పనులు కల్పించాలని సూచించారు. పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సౌకర్యాల కల్పన, కొత్త జాబ్‌కార్డుల జారీ, 18 ఏళ్లు నిండిన వారికి జాబ్‌కార్డులు అందించడం, ఎన్‌ఎంఎంఎస్ హాజరు, ఈ-కేవైసీ, మస్టర్ల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.