ట్రావెల్ డీల్స్.. క్యాష్‌బ్యాక్ కూడా
న్యూఢిల్లీ: ప్రయాణ ప్రియులకు అమెజాన్ పే(Amazon Pay) అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’(Impossible Travel Deals 2026) పేరుతో ప్రత్యేక సేల్‌ను నవంబర్ 12 నుంచి 26 వరకు నిర్వహించనుంది. మొత్తం 15 రోజుల పాటు కొనసాగే ఈ ఆఫర్‌లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లతో పాటు హోటల్ బుకింగ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ సేల్‌లో విమాన టికెట్లపై గరిష్ఠంగా 30 శాతం, హోటల్ బుకింగ్‌లపై 65 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే వారికి బ్యాంకాక్, దుబాయ్, వియత్నాం వంటి ప్రాంతాలకు ప్రత్యేక ధరలతో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల ప్రారంభ ధరలు
ప్రయాణ మార్గం ప్రారంభ ధర
ఢిల్లీ – బ్యాంకాక్
₹12,299
ముంబై – దుబాయ్
₹13,999
కోల్‌కతా – హో చి మిన్ సిటీ
₹15,599
ముంబై – గోవా
₹3,099
బెంగళూరు – కొచ్చి
₹4,199
ముంబై – ఢిల్లీ
₹6,099
హోటల్ బుకింగ్‌లపైనా భారీ ఆఫర్లు
విదేశాల్లోని ప్రముఖ హోటళ్లలోనూ తగ్గింపు ధరలకు బస చేసే అవకాశం కల్పిస్తోంది. దుబాయ్‌లోని దుసిత్ థానీ హోటల్‌లో రూ.6,649 నుంచి, సింగపూర్‌లోని కార్ల్టన్ సిటీ హోటల్‌లో రూ.15,089 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. దేశీయంగా గోవాలో హోటల్ బస రూ.4,899 నుంచి, కొచ్చిలో రూ.3,549 నుంచి అందుబాటులో ఉంటాయి.
తొలి రెండు రోజులు అదనపు క్యాష్‌బ్యాక్
నవంబర్ 12, 13 తేదీల్లో ముందస్తు ఆఫర్ల కింద విమాన టికెట్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ (గరిష్ఠంగా రూ.500), హోటల్ బుకింగ్‌లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ (గరిష్ఠంగా రూ.10,000) పొందవచ్చు. రూ.250కు పైగా బస్సు టికెట్ బుకింగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. నవంబర్ 14 నుంచి విమాన, హోటల్ బుకింగ్‌ల క్యాష్‌బ్యాక్ ఆఫర్లు తొలిసారిగా అమెజాన్ పే ద్వారా ప్రయాణ బుకింగ్ చేసే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయి.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనపు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రైమ్ సభ్యులకు 5 శాతం, ఇతర కార్డు వినియోగదారులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే ప్రయాణ తేదీలు, అందుబాటులో ఉన్న సీట్లు, హోటల్ గదులు, ఇతర నిబంధనలను బట్టి ఆఫర్లు మారవచ్చు. బుకింగ్‌కు ముందు పూర్తి వివరాలు పరిశీలించాలని సంస్థ సూచిస్తోంది.