సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61వ శాఖ

06-11-2026 | 05:10am

వనపర్తిలో ఘనంగా ప్రారంభం

వనపర్తి, నవంబర్ 5 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India) హైదరాబాద్ ప్రాంతంలోని తన 61వ శాఖను వన పర్తి (శాఖ కోడ్: 5306)లో గురువారం ఘనంగా ప్రారంభించింది. బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు అందించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే దిశగా ఈ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ బ్రాంచిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ జోనల్ మేనేజర్ ఏవీ రమణమూర్తి, హైదరాబాద్ ప్రాంతీయ అధిపతి గజేంద్ర సింగ్ చౌహాన్ గౌరవప్రదంగా పాల్గొన్నారు. 

మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్‌ఎల్‌ఎన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డీ శివ కుమార్ తదితర ప్రముఖులు, బ్యాంకు అధికారులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. వనపర్తిలో నూతన శాఖ ప్రారంభించడం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు సులభతరమైన, సమర్థవంతమైన, వినియోగదారుల కేంద్రిత బ్యాంకింగ్ సేవలను అందించాలనే తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఈ శాఖ వనపర్తి, పరిసర ప్రాంతాల ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్స హించడంలో కీలక పాత్ర పోషించనుంది. 

మరిన్ని వార్తలు