ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి?
- ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా జవాబు చెప్పాలి
- చోటాభాయ్ రేవంత్‌పై బడాభాయ్ మోదీ అభిమానమేమో?
- గజానికి రూ.2౦౦.. ఆర్‌ఆర్ ట్యాక్స్.. ఏ బిల్డర్, డెవలపర్‌ను అడిగినా వాస్తవమిదే
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో కోట్లు దోచుకుంటున్నారంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ అంటున్నారే గానీ, ఆ వసూళ్లపై ఎందుకు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ అంశంపై బీజేపీ నాయకత్వాన్ని గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు.
హైదరాబాద్‌లో ఏ బిల్డర్, డెవలపర్‌ను అడిగినా ఆర్‌ఆర్ ట్యాక్స్ వాస్తవమని తేలిపోతుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో చదరపు అడుగుకు రూ. 200 వసూలు చేస్తున్నది వాస్తవమని, ఈ విషయం రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని స్పష్టం చేశారు. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియడం లేదా ప్రశ్నించారు. మోదీ, అమిత్ షాలు స్వయంగా ఈ అంశంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటిపై చర్యలు తీసుకోవా ల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు.
హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రస్తావించడం తప్ప ఈ వ్యవ హారంపై తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలని కోరారు. తన ఏబీవీపీ చోటా భాయ్ రేవంత్‌పై బడా భాయ్ మోదీ ఎప్పటికీ చర్య లు తీసుకోరని ఎద్దేవా చేశారు. రేవంత్, రాహుల్‌పై కోట్ల రూపాయల దోపిడీ ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు, అదే అంశంపై చర్యలు తీసుకోవడం లో మాత్రం ఎందుకు వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలవి ఉత్త మాటలేనని పేర్కొ న్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత అవగాహనే ఈ వైఖరికి కారణమని తెలిపారు. ఆ అవగా హన వల్లే ఈ నిష్క్రియాపరత్వం కొనసాగుతున్నదా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన నల్ల వినయ్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా యువ నాయకుడు నల్ల వినయ్‌రెడ్డి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో నల్ల వినయ్ రెడ్డికి, ఆయన కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. భీమిరెడ్డి మనవడిగా వినయ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు, స్థానికంగా వారి కుటుంబానికి బలమైన పరిచయాలు, ప్రజల్లో ఆదరణ ఉన్నాయి. యువ నాయకుడిగా వినయ్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం నిర్మల్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు గర్జన బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి యువ నాయకుల చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.