కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు

17-11-2026 | 10:13am

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే వార్త. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు (Gold Prices) మంగళవారం కూడా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ (Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.1,36,040కు చేరింది.

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,24,700గా నమోదైంది. మరోవైపు వెండి ధర (Silver Price) మాత్రం కిలోకు రూ.1,90,000 వద్ద కొనసాగుతోంది.

అయితే ఈ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది. ఆభరణాల తయారీ ఖర్చులు కూడా అదనంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు