తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటలు

17-11-2026 | 09:31am

తిరుమలలో భక్తుల రద్దీ (Devotees Rush) కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూ లైన్ (Queue Line) కృష్ణతేజ అతిథిగృహం వరకు చేరుకుంది. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది.

మరోవైపు నిన్న ఒక్కరోజే 68,495 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ (Hundi Collection) ద్వారా రూ.4.08 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.

భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనానికి వచ్చే వారు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ (Travel Plan) చేసుకోవాలని సూచిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు