జాతీయ రహదారి.. దాబాలే అడ్డుగా మారి..!
- ఎన్‌హెచ్365 బీబీపై ప్రమాద ఘంటికలు!
- నిబంధనలకు విరుద్ధంగా దాబాల ముందు పార్కింగ్
- పెట్రోలింగ్ సిబ్బంది తీరుపైనా అనుమానాలు!
- గుంతలు తవ్వినా ఫలితం శూన్యం..!
- రమేష్ దాబా ఎదుట భారీ వాహనాల పార్కింగ్తో ప్రయాణికుల ఇబ్బందులు
చివ్వెంల, నవంబర్ 4 : జాతీయ రహదారి(National Highway) 365 బీబీపై అక్కలదేవిగూడెం గ్రామ(Akkaladevigudem village) సమీపంలోని రమేష్ దాబా ఎదుట భారీ వాహనాల పార్కింగ్(Parking for heavy vehicles) ప్రయాణికులకు ఇ బ్బందికరంగా మారిందని స్థానికులు గ గ్గోలు పెడుతున్నారు. నిత్యం వందలాది వా హనాలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతం లో రోడ్డు పక్కనే భారీ వాహనాలను నిలిపివేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెల కొంటున్నాయి అని రహదారిపై వాహనాల రద్దీకి తోడు భారీ వాహనాల పార్కింగ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థ పడు తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అండర్ పాస్ వద్ద అడ్డంకిగా..:
సూర్యాపేట నుంచి ఫ్లైఓవర్ మీదుగా ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు అతివేగంతో వ స్తుండగా, అండర్‌పాస్ నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలకు రమేష్ దాబా ఎదుట నిలిపిన భారీ వాహనాలు అడ్డంకిగా మారుతున్నాయి అని దీంతో వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను తప్పిం చుకునేందుకు రహదారిపైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందనీ వాహనదారులే చెబుతున్నారు.
ముఖ్యంగా ఫ్లైఓవ్ప నుంచి వేగం గా వచ్చే వాహనాలు, మరోవైపు అడ్డంగా నిలిపిన భారీ వాహనాల మధ్య ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతం లో కూడా ఇలాంటి సందర్బాలు ఎదురయినట్లు ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది అని వాపోతున్నారు.
గుంతలు తవ్వినా ఫలితం శూన్యం..!
ఈ సమస్యపై గతంలో స్పందించిన జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది జేసీబీ సహాయంతో రమేష్ దాబా ఎదురుగా మట్టి గుంతలు తవ్వించి భారీ వా హనాల పార్కింగ్‌ను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే హోటల్ నిర్వాహకులు గుంతలను పూడ్చివేసి తిరిగి భారీ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారనే ఆ రోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై పెట్రోలింగ్ సిబ్బంది నిరంతర పర్య వేక్షణ చేస్తున్నారా? ఒకసారి చర్యలు తీసుకున్న తర్వాత వాటి అమలును ఎందుకు పరిశీలించడం లేదు? అనే ప్రశ్నలు వాహనదారుల్లో తలెత్తుతున్నాయి. పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు కేవలం తాత్కాలికంగానే మిగిలిపోతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
హైవే మీద దాబాల అనుమతులపై తనిఖీలేవీ..?
చివ్వెంల మండల పరిధిలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల వెంట కొనసాగుతున్న హోటళ్లు, దాబాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. ఆయా హోటళ్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు ఉన్నాయా? పార్కింగ్‌కు సరైన స్థలం ఉందా? రహదారి హద్దులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారిపై వాహనాలను నిలిపి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చర్యలేవీ..?
ఈ మార్గం గుండా చుట్టుపక్కల గ్రామాల వారు ప్రతిరోజు పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లి వస్తుంటారని రమేష్ దాబా ఎదుట వారి వాహనాల పార్కింగ్ కా రణంగా భయభ్రాంతులకు గురవుతున్నారు అని గతంలో కూడా కంప్లైంట్ చేసిన నామమాత్రపు పనులు చేసి తర్వాత గాలికి వది లేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏదైనా పెద్ద ప్రమాదాలు జరిగితే త ప్ప శాశ్వత పరిష్కారాలు దొరకవా అనే వి ధంగా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి భారీ వాహనాల పార్కింగ్‌ను అరికట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రజల భద్రతకు ప్రాధా న్యత ఇవ్వాల్సిన అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పెట్రోలింగ్ సిబ్బంది చేపట్టిన చర్యల ను ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, గుంతలను పూడ్చి తిరిగి పార్కింగ్ చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కే వలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా ర హదారిపై భారీ వాహనాల పార్కింగ్‌ను పూర్తి గా నియంత్రించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రయాణికుల ప్రా ణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
అధికారులు పరిష్కారం చూపాలి
పని నిమిత్తం నిత్యం సూ ర్యాపేటకు వెళ్లి వస్తుంటానని, రమే ష్ దాబా ఎదుట భారీ వాహనాల పార్కింగ్ కారణంగా కొద్దిరోజుల క్రితం నేను కూడా ప్రమాదానికి గురయ్యా. ప్రతిరోజూ ఈ మార్గంలోప్రాణభయంతో ప్రయాణించాల్సి వస్తోంది .రోడ్ అధికారులు వెంటనే స్పందించి ప రిష్కారం చూపించి, నిబంధనలు పా టించని ధాబాలను మూసేయించాలి.
సుఖ్య నాయక్, స్థానికుడు