కేపీహెచ్‌బీలో అనుటెక్స్ షోరూమ్
ప్రారంభించిన సినీ నటి నిధి అగర్వాల్
హైదరాబాద్. అక్టోబర్ 8 (విజయక్రాంతి): కుటుంబ ఫ్యాషన్ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరొందిన అనుటెక్స్ కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 1లో గురువారం నూతన షో రూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. సినీ నటి నిధి అగర్వాల్(Actress Nidhhi Agerwal) ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.1970లో ప్రారంభమైన అనుటెక్స్ ఐదు దశాబ్దాలకు పైగా నాణ్యత, విశ్వసనీయత, అందుబాటు ధరలకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారుల ఆద రణ పొందుతోంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ దుస్తులు, పండుగల కలెక్షన్స్, రోజువారీ వస్త్రాలు తదితర విభాగాల్లో విస్తృత శ్రేణి దుస్తులను అందుబాటులో ఉంచినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుతం అనుటెక్స్ కుత్బుల్లాపూర్ పరిధిలోని కేపీహెచ్‌బీతో పాటు కొత్తపేట, అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఏఎస్ రావు నగర్, ఆర్సీ పురం, సుచిత్ర ప్రాంతాల్లో షోరూంలను నిర్వహిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, నాగేష్, రాజశేఖర్ తెలిపారు. ఒక చీర కొనుగోలు చేస్తే అదే ధర గల మరో చీర కేవలం రూ.1కే, రూ.4,999 విలువైన కొనుగోలుపై ఉచిత వెండి నాణెం, రూ.7,999 విలువైన కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం, రూ.1,499కు పైగా కొనుగోలుపై ఉచిత బహుమతులు ఇవ్వనునున్నామన్నారు. అనుటెక్స్ మరింత విస్తరణ దిశగా ముం దుకు సాగుతోందన్నారు.