18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో
25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శనల్లో ఒకటైన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో(Poultry India Expo) ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మా న్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎం ఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఎక్స్పోలో 120 దేశాల నుంచి 51 వేల మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు, 550కి పైగా సం స్థలు పాల్గొననున్నాయి. 24న హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీ- నోవోటెల్లో పౌల్ట్రీ నాలెడ్జ్డే- 20 26 నిర్వహించనున్నారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పీ. సింగ్ బఘేల్ ఈ కార్యక్రమాన్ని ప్రా రంభించనున్నారు. కోళ్ల పెంపకం పరికరాలు, హే చరీలు, దాణా తయారీ యంత్రాలు, ఫా ర్మ్ ఆటోమేషన్, కృత్రిమ మేధ (ఏఐ), వె టర్నరీ వైద్యం, వ్యర్థాల నిర్వహణ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రదర్శించనున్నా రు. గత ఎక్స్పోలో 500కు పైగా సంస్థలు, 51,251 మంది ప్రతినిధులు పాల్గొనగా, ఈసారి ఏడు హాళ్లలో 550కి పైగా సంస్థలు ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం, అంతర్జాతీయ వ్యా పార భాగస్వామ్యాల కల్పన ఈ ఎక్స్పో లక్ష్యమని ఐపీఈఎంఏ-పౌల్ట్రీ ఇండియా అధ్య క్షుడు ఉదయ్ సింగ్ బాయస్ తెలిపారు.