మచ్చర్‌కు నెతన్యాహు ఫోన్

05-10-2026 | 05:20am
  1. ధైర్య సాహసాలను కొనియాడిన ఇజ్రాయెల్ ప్రధాని
  2. మోదీతో కలిసి ఇజ్రాయెల్ స్వాతంత్య్ర వేడుకలకు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఫ్లుదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను(Indian pilot Captain Smith Matcher) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israeli Prime Minister Benjamin Netanyahu) అభినందించారు. అబుదాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌కు ఫోన్ చేసిన నెతన్యాహు.. అతని ధైర్య సాహసాలను కొనియాడారు. మేలో జరిగే ఇజ్రాయెల్ స్వాతంత్య్ర వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మచ్చర్‌ను కూడా ఆహ్వానించారు.

‘మీరు భారత్, ఇజ్రాయెల్ ప్రజలకే కాదు.. ప్రపంచం మొత్తానికి నిజమైన హీరో’ అని నెతన్యాహు ప్రంశసించారు. సాధారణంగా ఈ గౌరవం ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే దక్కుతుందని, అయితే మచ్చర్‌ను ఇజ్రాయెల్ ప్రజలంతా తమవాడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందించే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటని తెలిపారు. కాక్‌పిట్‌లో దాడి జరిగిన సమయంలో ప్రయాణికులు జోక్యం చేసుకునేలా తలుపు తెరిచి, విమానంలోని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో మచ్చర్ కీలకంగా వ్యవహరించారు.  

చివరి వరకు పోరాడే శక్తి నాలో ఉంది : మచ్చర్

దాడికి ముందు కో- ప్రార్థన చేసుకునేందుకు సమయం కావాలని అడిగినట్లు మచ్చర్ తెలిపారు. అతడి మాటలను గౌరవిస్తూ తాను అతడి వైపు చూడకుండా ముందుకు చూస్తూ ఉన్నానని చెప్పారు. కాసేపటికి తన తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగిలిందని, తొలుత విమానానికి ఏదో తీవ్రమైన నష్టం జరిగిందని భావించానని వివరించారు.  అది విమానంలో సమస్య కాదని, కాక్‌పిట్‌లో ఉన్న వ్యక్తే తనపై దాడి చేస్తున్నాడని అర్థమైంది’ అని చెప్పారు.

‘నాలో చివరి వరకు పోరాడే శక్తి మిగిలి ఉంది. అందుకే నా శక్తినంతా ఉపయోగించి తలుపు వద్దకు వెళ్లి దాన్ని తెరిచాను’ అని పేర్కొన్నారు. ఫ్లుదుబాయ్ విమాన ఘటనను ఉగ్రదాడిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అటార్నీ జనరల్ పేర్కొన్నారు. కో ఒమాన్ జాతీయుడైన హమామ్ అల్-హమామిగా అల్ అరేబియా వార్తా సంస్థ పేర్కొనగా.. దర్యాప్తు సంస్థ అధికారులు కూడా ధ్రువీకరించారు. 


మరిన్ని వార్తలు