టోలీచౌకిలో భారీ అగ్నిప్రమాదం

16-11-2026 | 11:56am

హైదరాబాద్: నగరంలోని టోలీచౌకిలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం(Fire Accident) కలకలం రేపింది. మండి కింగ్ రెస్టారెంట్(Mandi King Restaurant) కిచెన్ చిమ్నీలో చెలరేగిన మంటలు భవనంలోని పై అంతస్తుల వరకు వ్యాపించాయి. ఆరో అంతస్తులో ఉన్న జునైరా హోటల్ వరకు మంటలు చేరడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.

ప్రాథమిక అగ్నిమాపక శాఖ(Primary fire department) పరిశీలన ప్రకారం, కిచెన్ డక్ట్‌లో పేరుకుపోయిన వంటనూనె, జిడ్డు మంటలు వ్యాపించడానికి కారణమై ఉండొచ్చని గుర్తించారు. రెస్టారెంట్ చిమ్నీ(Restaurant Chimney) నుంచి మొదలైన మంటలు పై అంతస్తులకు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమిక వార్తా కథనాల్లో సమాచారం లేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


మరిన్ని వార్తలు