అగ్నిప్రమాదం.. వెల్డింగ్ నిప్పురవ్వలే కారణమా?
హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం (Fire Accident) కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ పెయింట్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. వెల్డింగ్ (Welding Work) పనుల సమయంలో ఎగసిపడిన నిప్పురవ్వలే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
దుకాణం పైభాగంలో బోర్డు ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెల్డింగ్ చేస్తుంగా వెలువడిన నిప్పురవ్వలు దుకాణంలోని పెయింట్లపై పడటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో దుకాణం మొత్తం అగ్నికీలలకు (Fire Flames) ఆహుతైంది.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Department) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.