సుదర్శన్ రెడ్డికి స్వాగతం

21-11-2026 | 03:55pm

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసన సభ్యులు పి. సుదర్శన్ రెడ్డి(Bodhan MLA P. Sudharshan Reddy) ఆదిలాబాద్ జిల్లా అధికార పర్యటనకు వెళ్తున్న సందర్భంగా నిర్మల్ మండలం కొండాపూర్ వద్ద జాతీయ రహదారిపై నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు(Nirmal Congress in-charge Kuchadi Srihari Rao) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. మరో విశిష్ట అతిథి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హందన్ గారిని కూడా శాలువాతో సన్మానించారు.  శ్రీహరి రావుతో పాటు నిర్మల్ జిల్లా డిసిసి ఉపాధ్యక్షులుఅతీక్ హైమద్, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే శేఖర్, నిర్మల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల రవికుమార్, సిద్ధల కుంట నర్సారెడ్డి, గడ్డింటి ప్రశాంత్, తూప్రాన్ సురేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు