విద్యార్థులు ఆత్మరక్షణ విద్యల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
నర్సాపూర్: విద్యార్థులు ఆత్మరక్షణ విద్యల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ సూచించారు. నర్సాపూర్ జూనియర్ కళాశాల మైదానంలో సన్‌షైన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిలుగా హాజరై విద్యార్థులకు తన చేతుల మీదుగా బ్లాక్బెల్ట్లను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో సాధన చేస్తూ వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుచేష్ యాదవ్, నిరంజన్, బీజేపీ జిల్లా కోశాధికారి అంజనేయులు గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు నాగేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీకాంత్, నాగరాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు, జిల్లా కార్యదర్శి శివ, నాయకులు వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.