తరిగొప్పులలో మండల స్థాయి ఎల్టా, చెకుముకి టాలెంట్ టెస్ట్

21-11-2026 | 03:44pm

తరిగొప్పుల,(విజయక్రాంతి): పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ తరిగొప్పుల పాఠశాల(PM Sri ZPHS Tarigoppula School)లో మండల స్థాయి ఎల్టా, చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎన్. జానకి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొని విద్యార్థులు ప్రస్తుత సమాజానికి అనుకూలంగా అభివృద్ధి చెందాలని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్టా మండల అధ్యక్షులు ఆవుల అమర్నాథ్, కృష్ణజ, వసంత్ నాయక్, నరేందర్, నరహరి, రవి, రమ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు