జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి నవీన్ ఎంపిక
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల(Telangana Tribal Welfare Gurukul Junior College) (సీఓఈ) విద్యార్థి యం. నవీన్ జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల(National Softball Championship)కు ఎంపికయ్యాడు. కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నవీన్, ఇటీవల నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నాడు.
ఈ నెల 24 నుంచి 28 వరకు పంజాబ్‌లో జరగనున్న 44వ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో నవీన్ పాల్గొననున్నాడు. జాతీయ పోటీలకు ఎంపికైన నవీన్‌ను కళాశాల ప్రిన్సిపాల్ ఇ. బలరాం, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, గురుకుల కళాశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.