ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒలింపియాడ్-2026

21-11-2026 | 03:34pm

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(English Language Teachers Association) ఎల్టా, ఎర్రుపాలెం మండలం వారి ఆధ్వర్యంలో మండల స్థాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒలింపియాడ్, టాక్స్  పోటీలను, మండల విద్యాశాఖ అధికారి బి.మురళీమోహన్(Mandal Education Officer B. Muralimohan) జిల్లా పరిషత్ హైస్కూల్, ఎర్రుపాలెం వేదికగా తేదీ 21-11-2026న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎర్రుపాలెం, రేమిడిచర్ల, రాజుపాలెం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజు , శ్రీనివాస్  రత్తమ్మ  పాల్గొన్నారు. 

ఈ విద్యా సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేయబోతున్న మండల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు దొండపాటి రమేష్, రంగు పుల్లాచారి , టి.వెంకటేశ్వర్లు ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.  గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది  కార్యక్రమంలో మండల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు పుల్లమ్మ , హసన్ , బాబీ, వస్తలాదేవి , సంధ్యారాణి  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు