గోండు రాజుల కోటలో గిరి ఉత్సవాలు

21-11-2026 | 03:46pm

గిరి ఉత్సవాలు నిర్వహించడం

భావితరాలకు సంస్కృతి అందించడమే

చాలా ఏళ్ల తర్వాత గిరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్‌లోని చారిత్రాత్మక  గోండు రాజుల కోటలో గిరి ఉత్సవాల  ను చాలా ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం రాజుల కోటలో  గిరి ఉత్సవాల నిర్వహణపై ఆదివాసీ తెగల నాయకులు, పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... డిసెంబర్ నెలలో నిర్వహించే గిరి ఉత్సవాలలో ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా నిర్వహించాలని పలు సూచనలు చేశారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతో గొప్పవని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గిరి ఉత్సవాలను ఆదివాసీ తెగలందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని, ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ఉత్సవాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో  మంద మకరందు మాట్లాడుతూ... దేశంలోనే వివిధ రాష్ట్రాలకు చెందిన  నాయకులు అధికారులతో పాటు  ప్రపంచంలోనే  అన్ని దేశాల కు చెందిన ప్రముఖులకు అదిలాబాద్ జిల్లా  ఉట్నూర్ గోండులు, కొలం గిరిజనుల మాతృభాష అర్థమయ్యే విధంగా " భాషా మంత్రం " విషయాన్ని  72% క్రౌడీకరించడం జరిగిందని గుర్తు చేశారు. భాషా మంత్రంతోపాటు  ప్రపంచంలో ఇక్కడి గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసే విధంగా  గిరి ఉత్సవాలను ఏర్పాటు చేస్తున్నామని పిఓ అన్నారు.

గిరి ఉత్సవాలలో ఆదివాసి 9 తెగలు తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలిసే విధంగా పలు సూచనలు చేయడంతో పాటు  గిరి ఉత్సవాల్లో పాల్గొనాలని సూచనలు చేశారు. ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం ఈ  జాదవ్ తానాజీ మాట్లాడుతూ... గోండు రాజుల కోటకు ఇప్పటివరకు 3.90 కోట్లు ఖర్చు చేశామని, మరో ఏడు కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని  వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, జిల్లా రాయచోట్ల సార్ మేడి తొడసం అమృతరావ్, ఆదిమా గిరిజన సలహా సంఘం  మాజీ చైర్మన్ సిడం భీంరావు,  ఏపీవో  ఆత్రం భాస్కర్, ఎంపీడీవో రైస్, ఆదివాసీ తెగల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు