బీజేపీ నేత కాంగ్రెస్లో చేరిక
మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న కొమ్మిడి కమలాకర్ రెడ్డి
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, బూత్ ఇన్చార్జి కొమ్మిడి కమలాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Former MLA Mynampally Hanumantha Rao) ఆధ్వర్యంలో శనివారం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు(Welfare schemes) ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజా పాలనకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదన్న, ఆర్టీఏ మెంబర్ డాక్టర్ సూర్యవర్మ, ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ రమేష్ కోదాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.