సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి

11-09-2026 | 12:59pm

హుజూర్‌నగర్‌, సెప్టెంబర్ 11: పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా నిర్మిస్తున్న ఎయిర్‌టెల్ సెల్ టవర్(Airtel cell tower) నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు.టవర్ నిర్మాణం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం కమిషనర్ సతీష్, మున్సిపల్ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు... ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదే విషయమై  సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా అన్ని అనుమతులు ఉన్నాయంటూ పనులు ఆపేది లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు