4 September, 2026 | 8:06 PM

ఐదు పులుగుల వాగు వద్ద ఘోర ప్రమాదం... ఇద్దరు మృతి

04-09-2026 | 12:52pm

రామాయంపేట సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): ఐదు పులుగుల వాగు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road accident)లో ఇద్దరు మృతి చెందినట్లు నిజాంపేట ఎస్సై రాజేష్ (Nizampet SI Rajesh) తెలిపారు. నందిగామ(Nandigama) అండర్ బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనం కిందపడటంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. ఒకరి ఐడీ కార్డ్ ఆధారంగా 'వసంత్ రాథోడ్'గా గుర్తించారు. పూర్తి వివరాలకు నిజాంపేట పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.