ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు బోల్తా

09-11-2026 | 11:01am

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. లక్నో సమీపంలోని పారా ప్రాంతంలో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే (Agra Expressway) జీరో పాయింట్‌ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 55 నుంచి 60 మంది ప్రయాణికులు (Passengers) ఉన్నట్లు తెలుస్తోంది. 

బస్సు బోల్తాపడటంతో పలువురు అందులో చిక్కుకుపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది (Rescue Team) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు