జపాన్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ దీపావళి

09-11-2026 | 10:38am

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కుటుంబం ఈ ఏడాది దీపావళి వేడుకలను (Diwali Celebrations) జపాన్‌లో ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం జపాన్‌లో ఉన్నప్పటికీ సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి హోమం నిర్వహించి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన అందమైన ఫొటోలను విజయ్ సోషల్ మీడియాలో (Social Media) అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. "దీపావళి శుభాకాంక్షలు.. మా దేవరకొండ కుటుంబం తరఫున మీ అందరికీ ప్రేమాభిమానాలు, ఆప్యాయ ఆలింగనాలు" అంటూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నా భారతీయ సంప్రదాయాలను మరిచిపోకుండా పండుగ జరుపుకోవడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ షేర్ చేసిన ఈ ఫొటోలు (Viral Photos) ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు