డెంగ్యూతో డేంజర్
29-09-2026 | 12:33pm
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముర్తుజగూడకు చెందిన సామ రిషితారెడ్డి(17)డెంగ్యూ(Dengue) బారినపడి మృతి చెందింది.మణికొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రిషితారెడ్డికి ఇటీవల జ్వరం వచ్చింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తరగతులకు హాజరవుతూ వచ్చింది.మూడు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.