ఎయిర్‌పోర్టుకు తెలంగాణ తొలి అమరుడి పేరు
మామునూరు విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి
కురుమ సంఘం జిల్లా కన్వీనర్ కోరె సుధాకర్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): వరంగల్ మమునూరు విమానాశ్రయానికి(Warangal Mamnoor Airport) తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని కురుమ సంఘం(Kuruma Sangam) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ కోరె సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం సాగిన ఉద్యమంలో ఆయన అమరుడయ్యారని తెలిపారు.
భూమి, భుక్తి, తెలంగాణ ప్రజల విముక్తి కోసం తన ప్రాణాలను అర్పించిన దొడ్డి కొమురయ్యకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని సుధాకర్ అన్నారు. ఆయన త్యాగాలకు గుర్తుగా మమునూరు విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ద్వారా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను, దొడ్డి కొమురయ్య త్యాగాలను భవిష్యత్ తరాలకు గుర్తుచేసే అవకాశం ఉంటుందని సుధాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.