వాటర్ లైన్‌మెన్ మృతి

22-11-2026 | 10:23am

మహమ్మదాబాద్,నవంబర్ 22, విజయక్రాంతి: మనడల పరిధిలోని నంచర్ల గ్రామానికి చెందిన మహమ్మద్ మసూద్అలీ,తండ్రి ఇక్బాల్, మిషన్ భగీరథలో(Mission Bhagiratha Accident) వాటర్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో బోరింగ్ తాండ గ్రామంలోని వాటర్ ట్యాంకుకు మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా నీటిని నింపేందుకు ట్యాంక్‌పైకి ఎక్కాడు.ఆ సమయంలో ప్రమాదవశాత్తు ట్యాంక్‌పై నుంచి కింద పడటంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య ఫరీదా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మహమ్మదాబాద్,ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు