మంచు కురిసే వేళలో..

22-11-2026 | 07:55am

వెంకటాపూర్, నవంబర్ 22 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం దట్టమైన మంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి మంచు(Dense Fog Disrupts) కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాలన్నీ మంచు దుప్పటిని తలపించాయి. రహదారులపై మంచు ప్రభావంతో దృశ్యమానత తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఉదయాన్నే ప్రయాణించే వారు ఇబ్బందులు పడ్డారు. మంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు