ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్పో
- హైదరాబాద్ వేదికగా హైటెక్స్‌లో 18వ సదస్సు
- ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహణ
- 550కి పైగా ప్రదర్శకులు.. 125 దేశాల నుంచి 51 వేల మంది ప్రతినిధులు
- ఎక్స్పోను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శనల్లో ఒకటైన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో హైదరాబాద్(Poultry India Expo in Hyderabad) వేదిక కానుంది. నవంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్న ఈ అం తర్జాతీయ ప్రదర్శనను సీఎం రేవంత్‌రెడ్డి ప్రా రంభించనున్నారు. ఈ ఎక్స్‌పోలో 125 దేశా ల నుంచి 51 వేల మందికి పైగా పౌల్ట్రీ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నా రు. 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నాయి.
ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నారు. నవంబర్ 24న హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీ -నోవోటెల్లో పౌల్ట్రీ నాలెడ్జ్ డే నిర్వహించనున్నారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం
నాలెడ్జ్ డేలో పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలపై నిపు ణులు చర్చించనున్నారు. కోళ్ల ఆరోగ్యం, శాస్త్రీయ పోషకాహారం, దాణా నిర్వహణ, టీకా విధానాలు, ఆటోమేటెడ్ కోళ్ల పెంపక కేంద్రాలు, కృత్రిమ మేధ (ఏఐ), సుస్థిర ఉత్పత్తి విధానాలపై అవగాహన కల్పించనున్నారు. మూడు రోజుల ఎక్స్‌పోలో కోళ్ల పెం పక పరికరాలు, హేచరీలు, దాణా తయారీ యంత్రాలు, ఫార్మ్ ఆటోమేషన్, వెంటిలేషన్ వ్యవస్థలు, వెటర్నరీ వైద్యం, వ్యాధి నిర్ధారణ, గుడ్ల ప్రాసెసింగ్, వ్యర్థాల నిర్వహణకు సం బంధించిన ఆధునిక సాంకేతికతను ప్రదర్శించనున్నారు.
లక్షలాది మందికి ఉపాధి
దేశంలో పౌల్ట్రీ రంగం ఆహార భద్రత, పో షకాహారం, గ్రామీణ ఉపాధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంపై ఆధారపడి రైతు లు, వ్యాపారవేత్తలు, అనుబంధ పరిశ్రమల్లో సుమారు 50 నుంచి 60 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. 2023- భారత్ 142.77 బిలియన్ గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో రెండో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా నిలిచింది. కోళ్ల మాంసం ఉత్పత్తిలోనూ భారత్ ప్రముఖ దేశాల్లో ఒకటిగా ఉంది.
అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం
ఐపీఈఎంఏ 20కి పైగా అంతర్జాతీయ పౌల్ట్రీ సంఘాలు, 40 జాతీయ స్థాయి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. గత ఎక్స్‌పోలో 500కు పైగా సంస్థలు, 51,251 మంది పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రదర్శనలు జరిగాయి. ఈసారి ఏడు హాళ్లలో 550కి పైగా సంస్థలు పాల్గొననున్నాయి.
ఎక్స్పో ద్వారా దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆదరణ, అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనున్నట్లు ఐపీఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బాయస్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్-2047 లక్ష్యాల సాధనకు ఈ ప్ర దర్శన దోహదపడుతుందన్నారు.ఈ నెల 25 నుంచి 27 వరకు రోజూ ఉదయం 10 నుం చి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు ఎక్స్పో అందుబాటులో ఉంటుం ది.
సీఎంను కలిసి ఆహ్వానించిన ప్రతినిధులు
18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వా నించిన వారిలో పౌల్ట్రీ ఇండియా, ఐపీఈఎంఏ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బాయస్, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కార్యదర్శి భాస్కర్ రావు, కోశాధికారి అభిషేక్ రెడ్డి, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ హైదరాబాద్ జోన్ ఛైర్మన్ గుర్రం చంద్రశేఖర్‌రెడ్డి తదితరు లున్నారు.