అవినీతిని వెలికితీస్తం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ దోపిడీని బయటపెడ్తం
- ప్రజాధనంలో ప్రతి పైసా లెక్క తేల్చుతం
- దోచుకున్న సొమ్మును వసూలు చేస్తాం
- మెటా సంస్థపై దాడులు పెట్టుబడులపై దెబ్బ
- రేవంత్, కేసీఆర్, కేటీఆర్ కావాలనే విమర్శలు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఫైర్
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని(BJP government), తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల అవినీతిని వెలికితీస్తామని, ప్రజా ధనంలో ప్రతి పైసాకు లెక్కలు తేల్చి, దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు(BJP State President N. Ramchander Rao) పేర్కొన్నారు. మెటా వంటి బహుళజాతి సంస్థలపై దాడులు హైదరాబాద్‌కు పెట్టుబడుల రాకను దెబ్బతీస్తాయని ఆం దోళన వ్యక్తం చేశారు. ఇందుకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ లో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటం చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, మేధావులు, విద్యావే త్తలు సహా వివిధ రంగాల ప్రముఖులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరు గుతున్న పరిణామాలను గమనిస్తున్న విద్యావంతులు, మేధావులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరు తున్నారని తెలిపారు.
ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నిరసన, మెటా కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను అవమా నపరిచేలా, దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరిచేలా వ్యహహరిస్తు న్నారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన న్యూఢిల్లీలోని ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనను ఖండించారు. అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో దుస్తులు విప్పి ప్రదర్శన చేయడం ద్వారా ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెట్టుబడులెలా వస్తాయి?
హైదరాబాద్‌లోని ప్రముఖ బహుళజాతి సాం కేతిక సంస్థ మెటా కార్యాలయంపై జరిగినట్లు చెబుతున్న దాడిని ప్రస్తావిస్తూ, కార్యాలయంలో విధ్వంసం, ఆస్తులను ధ్వంసం చేయడం, ఉద్యోగులను బెదిరించడం వంటి చర్యలను రాంచందర్ రావు ఖండించారు. ఒకవైపు పెట్టుబడులను ఆక ర్షిస్తామని చెబుతూ, మరోవైపు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి గ్లోబల్ సమ్మిట్లు నిర్వహిస్తున్నారు...
మరోవైపు ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టి కార్యక లాపాలు సాగిస్తున్న సంస్థల కార్యాలయాలపై దా డులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయి?, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. గతంలో మెటా సంస్థ భారతీయత గురించి మాట్లాడిన పలువురు నాయకుల సామాజిక మాధ్యమ ఖాతాలను బ్లాక్ చేయడం, సస్పెం డ్ చేయడం జరిగిందని, తన ఖాతా కూడా సస్పెం డ్ అయిందని, ఆ ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.
సామాజిక మాధ్యమ సంస్థల చర్యలపై అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా నిరసన తెలియజేయాలని స్పష్టం చేశా రు. మెటా సంస్థపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలు ఉన్నాయి.. న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చన్నారు. కానీ ఒక సం స్థ కార్యాలయంపై దాడి చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించడం సమర్థనీయం కాదన్నారు.
బీజేపీ అంటే భయం..
బీజేపీ బలం పెరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు భయం పట్టుకుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం బీజేపీ లక్ష్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ అ యినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా ఎప్పుడూ బీజేపీ గురించే మాట్లాడుతున్నారు. అమిత్ షా గురించి విమర్శలు చేస్తారు. ఎవరు బాద్షా అంటూ పోలికలు పెడతారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరగకపోతే మీకు ఎందుకంత భయం? నిరంతరం బీజేపీనే ఎందు కు లక్ష్యంగా చేసుకుంటున్నారు?’ అని నిలదీశారు.
అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తాం...
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, అక్రమాలన్నింటినీ వెలికితీస్తామని తెలిపారు. ప్రజాధనంలో ప్రతి పైసాకూ లెక్కలు అడుగుతామని, దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి వసూలు చేస్తామని, అవినీతికి పాల్పడిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్ర అప్పులు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉండగా, అప్పులు, ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల పాలనను, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రజలు నిశితంగా గమని స్తున్నారని ఆయన పేర్కొన్నారు.
విద్యారంగం, రైతులపై నిర్లక్ష్యం..
విద్యా సంస్థల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ఫిజికల్ ట్రైనర్లుగా పనిచేస్తున్న వారి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగాలను క్రమబద్ధీక రించాలని, వేతనాలను పెంచాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం తో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.