పబ్బతి ఆంజనేయ స్వామి మహా పాదయాత్ర

22-11-2026 | 10:17am

కాషాయ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన సర్పంచ్లు.. 

భజనలు, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన ఆధ్యాత్మిక ఊరేగింపు..

మఠంపల్లి నవంబర్ 22(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలో పబ్బతి ఆంజనేయ స్వామి హనుమత్ మహా పాదయాత్ర(Pabbathi Anjaneya Swamy Hanumath Maha Padayatra ) భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ప్రారంభమైంది. మండలంలోని కొత్త తండా అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి హనుమంతుల గూడెంలోని శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ మహా పాదయాత్ర కొనసాగింది.బానోతు వెంకటేశ్వర్లు గురుస్వామి,బానోతు రాజేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను సర్పంచ్లు బానోతు అరుణాదేశ్ పాండు నాయక్, మాలోతు సక్రు నాయక్ స్వాములు,భక్తులతో కలిసి కాషాయ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు కాషాయ వస్త్రధారణలో,అయ్యప్ప స్వాములు స్వామివారిని స్మరిస్తూ భజనలు,భక్తి గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు.జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల హనుమత్ నామస్మరణతో పాదయాత్ర మార్గమంతా భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.హనుమంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరిలో భక్తిభావం,ఆధ్యాత్మిక చింతన పెంపొందాలని భక్తులు ఆకాంక్షించారు. గురుస్వాముల ఆధ్వర్యంలో సాగిన ఈ మహా పాదయాత్ర భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు లక్ష్మి భరత్ నాయక్,బాల నాయక్ నాగు నాయక్,వీణా నాయక్,దేవాలయం చైర్మన్ నాగరాజు, ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల అయ్యప్ప,హనుమన్, శివయ్య స్వాములు, భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు