నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలకు రండి

22-11-2026 | 05:10am

త్రిపుర గవర్నర్‌ను ఆహ్వానించిన డా.గజల్ శ్రీనివాస్  

హైదరాబాద్, నవంబర్ 21(విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు(Andhra Saraswata Parishattu) ఆధ్వ ర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులోని నెకస్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు బాలలు 2026కు ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని పరిషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ ఆహ్వా నించారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో గవర్నర్‌ను కలిసి మహాసభల విశేషాలను వివరించారు.

బాలల కోసం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని  శ్రీనివాస్ పేర్కొన్నారు. డిసెంబర్ 19న సాయంత్రం జరిగే ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను, ప్రతిభావంతులైన బాలలను సత్కరిం చాలని  గవర్నర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో డా. గజల్ శ్రీనివాస్ కుమార్తె, గాయని కుమారి సంస్కృతి, ప్రముఖ పారిశ్రామికవేత్త కంతేటి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు