ఓబీసీల కోసం చంద్రబాబు గళమెత్తాలి!

08-10-2026 | 05:00am

ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(United Andhra Pradesh) బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి(Political representation of BCs) ప్రాధాన్యమిచ్చిన తెలుగుదేశం పార్టీకి(Telugu Desam Party) ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓబీసీల హక్కుల(Rights of OBCs) కోసం గళమెత్తే అవకాశం ఉంది. రిజర్వేషన్లకు చట్టబద్ధత, సమగ్ర కులగణనలో(Comprehensive caste census) ఓబీసీలకు ప్రత్యేక ప్రాధాన్యం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబుపై ఉంది.

కేంద్రంలో భాగస్వామ్యాన్ని కేవలం అధికారానికే పరిమితం చేయకుండా బీసీ, ఓబీసీల ప్రయోజనాల కోసం వినియోగించాలి. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, నాలుగు దశాబ్దాల తెలుగుదేశం ప్రస్థానంలో బలహీన వర్గాలకు కల్పించిన ప్రాతినిధ్యాన్ని జాతీయ స్థాయిలో ముం దుకు తీసుకెళ్లాల్సిన సమయం ఇదే.

దేశంలో కులగణన చేపడుతామని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆచరణలో మా త్రం దాగుడు మూతల ధోరణిని అవలంబిస్తోంది. దేశ జనాభాలో అత్యధిక భాగంగా ఉన్న ఓబీసీ స మాజానికి సంబంధించిన సమగ్ర కులవారీ జనాభా లెక్కలు లేకుండా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలపై సమర్థవంతమైన విధానాలు ఎలా రూపొందిస్తారనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.

కులగణనపై హామీలు ఇచ్చిన తర్వాత నిర్వహించిన సర్వే ప్రక్రియల్లో ఓబీసీలకు స్పష్టమైన, ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొదటి దశలో 33 అంశాలతో కూడిన కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఓబీసీ కుల వివరాలకు తగిన స్థానం కల్పించలేదనే అభ్యంతరాలు వచ్చా యి. అనంతరం రెండో దశ కులగణనలో 40 ప్రశ్నలు పొందుపరిచినప్పటికీ, ఎప్పటిలాగే పదో ప్రశ్నలో ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన ఉండి, ఓబీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం పట్ల దేశంలోని కోట్లాది ఓబీసీలు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం ఇప్పటికే కులగణనకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పు డు చర్చ కులగణన జరగాలా లేదా? అనే దశను దాటి ‘కులగణన ఎలా జరగాలి?’ అనే దశకు వచ్చింది. ఈ దశలో ఓబీసీ సమాజానికి సంబంధించిన ప్రశ్నలు స్పష్టంగా లేకపోతే, భవిష్యత్‌లో వచ్చిన గణాంకాలు సామాజిక న్యాయ విధానాలకు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది ప్రశ్నార్థకంగా మారవచ్చు.

అందువల్ల ఎన్డీఏలో భాగస్వాములైన చంద్రబాబు కేంద్రంతో సమన్వయం చేస్తూ ఓబీసీలకు సమగ్రంగా ఉప యోగ  కులగణన విధానం కోసం తమ డిమాండ్‌ను స్పష్టంగా నమోదు చేయడం రాజకీయంగానే కాకుండా విధానపరంగానూ ప్రాధాన్యమైన అంశం. 2027జనగణన దేశానికి చారిత్రక అవకాశంగా మారుతున్న వేళ, ఓబీసీ సమాజం గొంతును కేంద్ర నిర్ణయ ప్రక్రియలో బలంగా వినిపించేందుకు చంద్రబాబు ముందుకు రావాలన్న డిమాండ్ ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. బాబు చేతిలో ఉన్నది ‘బీజేపీకి అల్టిమేటం’ తప్ప వేరే మార్గం లేదు. 

కులగణన విషయంలో రేవంత్ ప్రభుత్వం ఆయా కులాల లెక్కలు తీసి ఆదర్శంగా నిలిచింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలని దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందుకే ఓబీసీ సమాజం ‘కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఇవ్వాలి’ అని కోరుతోంది.

ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామైన చంద్రబాబుతమ రాజకీయ బలాన్ని ఓబీసీల కోసం వినియోగించాలి. ఇది ఒక పార్టీకి వ్యతిరేకమైన అంశంగా కాకుండా, కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని మరింత స్పష్టంగా, సమగ్రంగా అమలు చేయించాలనే డిమాండ్‌గా చూడవచ్చు. అధికారం కోసం మోదీతో చే తులు కల్పి  న్యాయ ఎజెండాను తుంగలో తొక్కి, ఓబీసీలను నయవంచనకు గురిచేస్తే వచ్చే ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం.

 వ్యాసకర్త: కేయూ

జర్నలిజం విభాగాధిపతి, 99866255355

మరిన్ని వార్తలు