దశరథుడిగా అరుణ్ గోవిల్
నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇతిహాస కథాచిత్రం ‘రామాయణ(Ramayana)’. ఇందులో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయిపల్లవి(Sai Pallavi) సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ అరుణ్ గోవిల్ దశరథుడిగా నటిస్తున్న ప్రత్యేక సోలో పోస్టర్‌ను విడుదల చేశారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఇదే ఏడాది నవంబర్ 5న, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.