కుప్ప కూలిన 25 గజాల భవనం
- చిన్నారి మృతి, పలువురికి గాయాలు
- శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
- ఢిల్లీ న్యూ సీమాపురిలో ఘటన
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 7: ఢిల్లీలో(Delhi) 25 గజా ల్లో నిర్మించిన నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలి(Multi-storied building collapses) ఓ చిన్నారి మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేస్తూ, పోలీసులు, అగ్నిమాపక శాఖలకు(Police and fire departments) సమాచా రం అందజేశారు. బుధవారం మధ్యాహ్నం ఈద్గా సమీపంలోని న్యూ సీమాపురి ప్రాంతంలో(New Seemapuri Province) 3 గంటలకు ఓ భవనం కూలిపోయింది. దీంతో దీనిపక్కనున్న మరో రెండు నివాస భవనాలకు కూడా నష్టం వాటిల్లింది.
విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగారు. రాత్రివరకు శిథిలాల నుంచి ఎనిమిది మంది ని ర క్షించగా, ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద 10 మంది వరకు చి క్కుకున్నారన్న స్థానికుల సమాచారం మేరకు రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం గుండా వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు రహదారిని మూసివేసి రెస్క్యూ చర్యలు చేపట్టారు. షాదారా జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్, డీసీపీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా శిథిలాల కింద చిక్కుకున్న వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.