ఎన్నికలు ఒక మైండ్ గేమ్

03-11-2026 | 05:00am

టీ చిరంజీవులు :

ఎన్నికలు(Elections) అంటే కేవలం ఓట్ల(Votes) యుద్ధం కాదు, అవి ఇప్పటివరకు ‘3ఎమ్’ ( మనీ, మజిల్, మీడియా) అంటే డబ్బు, కండబలం, మీడియా బలం అని అందరు అనుకుంటున్నారు. ఈ మధ్య చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(Chief Election Officer) అన్నట్లుగా ప్రవర్తన నియమావళి ( మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్స్ ఆర్ మానిప్యులేషన్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్) ఉల్లంఘనలను లెక్కలోకి తీసుకుంటే ‘4ఎం’ అవుతాయి. దానికి మ నం మైండ్‌గేమ్ కలిపితే ‘5ఎమ్’ అవుతా యి. మైండ్‌గేమ్ అంటే ప్రధానంగా ప్రజల ఆలోచనలు, భావోద్వేగాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలు.

బడ్జెట్ లేదని తెలిసిన, సాధ్యం కాదని తెలిసిన, అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవటం, ప్రజ ల ఆశలను సొమ్ము చేసుకోవటం ఇవన్నీ మైండ్‌గేమ్‌లో భాగం. ప్రజలు ఎలా ఆలోచిస్తారు? వారి ఆశలు ఏమిటి? దేనికి బాధ పడుతున్నారు? దేనిని కోరుకుంటున్నా రు? అనే అంశాలను అర్థం చేసుకుని, వారి మనసులను ప్రభావితం చేయగల నాయకుడు ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన ఆధిక్యాన్ని సాధించగలడు.

1. మానసిక శాస్త్రం(సైకాలజీ) ప్రకారం ఎన్నికల్లో రెండు రకాల పోరాటాలు జరుగుతాయి. ఎ.క్షేత్రస్థాయి పోరాటం: ప్రచా రం, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచా రం, కార్యకర్తల సమీకరణ, ఓటర్లను కలవడం. 2.మనసుల పోరాటం: భావోద్వే గాలను రెచ్చ గొట్టడం, ప్రాంత, మత ప్రస్తావనల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావి తం చేయడం, ఆశలు కల్పించడం, నాయకుడి పట్ల సానుకూల దృక్పథాన్ని పెం పొందించడం, ఓటర్లు తమ భవిష్యత్తుకు ఎవరు సరైన నాయకుడో, పార్టీయో నిర్ణయించుకునేలా చేయడం, క్షేత్రస్థాయి పోరాటం ప్ర జలను భౌతికంగా చేరుకుంటుంది. మనసుల పోరాటం వారి నిర్ణయాలను ప్రభా వితం చేస్తుంది.

ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలు

I) సమాచారం కంటే భావోద్వేగం బలమైనది : ప్రజలకు అనేక విషయాలు తెలిసి ఉండవచ్చు. కానీ వారి తుది నిర్ణయంపై ఆశ, ఆత్మగౌరవం, ఆగ్రహం, భ యం, అన్యాయంపై అసంతృప్తి వంటి భావోద్వేగాలు ప్రభావం చూపుతాయి. ప్రజల జీవిత అనుభవాలతో అనుసంధానమైన ప్రచారమే వారి మనసులను చేరు కోగలదు.

ఉదాహరణలు  : 1. 2014లో తెలంగాణలో టీఆర్‌ఎస్ విజయం.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రజల భా వోద్వేగాలను రాజకీయ మద్దతుగా మార్చి న ముఖ్యమైన ఉదాహరణ.

2. 1983లో ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మ గౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చారు. సామాజిక గుర్తింపు భావన ఐక్యతను పెంచుతుంది. కులం, సామాజిక వర్గం, ప్రాంతం, భాష, వృత్తి, ఆర్థిక స్థితిగతులు ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు.

ఓటర్లలో మూడు ప్రశ్నలు : ఎ)మనల్ని అర్థం చేసుకునేది ఎవరు? బి)మనకు ప్రాతినిధ్యం వహించేది ఎవ రు? సి)మన ప్రయోజనాలను కాపాడగలిగేది ఎవరు? అయితే, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారందరూ ఒకే విధంగా ఓటు వేస్తారని భావించడం సరైనది కాదు. ఉదాహరణకు బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమంలో దళితుల గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యానికి ప్రాధాన్యం లభించింది. కాన్షీరామ్ నిర్మించిన రాజకీయ పునాదిపై మాయావతి నా యకత్వం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని సా ధించింది. తమిళనాడులో ద్రావిడ ఉద్య మం భాషా, -ప్రాంతీయ గుర్తింపు, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల ప్రాతిని ధ్యం వంటి అంశాలను దీర్ఘకాలిక రాజకీయ చైతన్యంతో అనుసంధానించింది.

3.హామీల కంటే నమ్మకం ముఖ్యం : ధనవంతుడైన అభ్యర్థి కంటే, నిజాయితీగా వ్యవహరించే, అందుబాటులో ఉండే, ఇ చ్చిన మాటకు కట్టుబడి ఉండే అభ్యర్థిపై ప్ర జలు ఎక్కువ విశ్వాసం చూపవచ్చు. ప్రజలకు హామీలిచ్చే నాయకుడి కంటే, తన ప్ర వర్తన ద్వారా నమ్మకాన్ని సంపాదించే నా యకుడు ఎక్కువ ప్రభావం చూపగలడు.

ఉదాహరణలు : 2014లో నరేంద్ర మోదీ నాయకత్వం అభివృద్ధి, ఉద్యోగాలు, మెరుగైన పాలనపై ఆశలను ముందుకు తెచ్చింది. బీజేపీ 543 లోక్‌సభ స్థానాల్లో 282 గెలుచుకుంది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి స్థానిక సేవలకు ప్రాధాన్యమిచ్చి 70 స్థానాల్లో 67 గెలుచుకుంది. ఈ ఫలితాలను అర్థం చేసుకోవాలంటే వాగ్దానాలతో పాటు అప్పటి రాజకీయ పరిస్థితులు, ప్ర త్యర్థి పార్టీల స్థితి వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఎంజీ రామచంద్ర న్ (1977, తమిళనాడు)..  ప్రజాదరణతో పాటు పేదల సంక్షేమంపై దృష్టి పెట్టి బలమైన మద్దతు సంపాదించారు. అన్నాడీ ఎంకే 234 స్థానాల్లో 130 గెలుచుకుంది.

4.ప్రజల ఆలోచనలను రాజకీయ కథనం ప్రభావితం చేస్తుంది : ప్రజలు ప్రతి విధానాన్ని విడివిడిగా విశ్లేషించరు. అనేక సందర్భాల్లో వారు ఒక విస్తృత రాజకీయ దృక్పథం ఆధారంగా పరిణామాల ను అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు మార్పు వర్సెస్ యథాతథ స్థితి, న్యా యం వర్సెస్ అన్యాయం, అభివృద్ధి వర్సెస్ నిర్ల క్ష్యం, సమాన అవకాశాలు వర్సెస్ వివక్ష.

ఉదాహరణలు: ఎన్టీఆర్ ‘తెలుగువారి ఆత్మగౌరవం’ను, తెలంగాణ ఉద్యమ నా యకత్వం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ను రాజకీయ కథనాలుగా ముందుకు తెచ్చాయి. 2014లో బీజేపీ అభివృద్ధి, నాయకత్వం, పాలనా మార్పు అంశాలను ప్రధానంగా ప్రచారం చేసింది. 2015 ఢిల్లీలో ఆప్ ప్రజా సేవల నాణ్యతను రాజకీయ చర్చలో కేంద్రంగా నిలిపింది. ప్రభా వవంతమైన కథనం నినాదం మాత్రమే కాదు.. దానికి అనుగుణమైన కార్యాచరణ, నమ్మదగిన నాయకత్వం కూడా అవసరం.

5.వాస్తవ పరిస్థితులతో పాటు ప్రజల దృక్పథం కూడా ముఖ్యం : ఒక నాయకుడు సమర్థుడని, ప్రజలకు చేరువగా ఉం టాడని లేదా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భావిస్తే, ఆ అభిప్రా యం మరికొందరి అంచనాలనూ ప్రభావితం చేయవచ్చు. అయితే, సభలకు వచ్చే జనసందోహం లేదా సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఆదరణ వాస్తవ ఓట్లకు నేరుగా సమానమని భావించకూడదు.

2003 పాదయాత్ర ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల సమస్యలు, ఉచిత విద్యు త్ హామీ, మొదలగు ప్రజల వాస్తవ దృక్పథాన్ని ప్రతిబింబించారు. ఫలితంగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం ది. బిహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వంపై రహదారులు, శాంతిభద్రతలు, మహిళల సాధికారత వంటి అంశాల ఆధారంగా ప్రజలు అభిప్రాయాలు ఏర్పరచుకున్నా రు. ఎంజీ రామచంద్రన్ పాలనలో పాఠశాల పిల్లల మధ్యాహ్న భోజన పథకం వంటి సంక్షేమ చర్యలు పేదల పట్ల ప్రభు త్వం శ్రద్ధ చూపుతోందనే భావనకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోవ డం, దానికి అనుకూలంగా తమ మేనిఫెస్టోలలో చేర్చటం, ప్రజలకు చేర్చటం అంతే ముఖ్యం.

6.వ్యక్తిగత పరిచయం నిబద్ధతను పెంచుతుంది- : ఒక నాయకుడు నేరుగా ప్రజలను కలవడం, వారి ఇళ్లకెళ్లడం, సమస్యలను శ్రద్ధగా వినడం, పరిష్కారానికి కృషి చేయడం వంటి చర్యలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. భారీ బహిరంగ సభ కంటే, ఒక వ్యక్తితో హృదయపూర్వకంగా మాట్లాడటం కొన్నిసార్లు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవచ్చు. పాదయాత్రలు సాన్నిహి త్యాన్ని పెంచుతాయి. ప్రజలతో ఏర్పడే వ్యక్తిగత అనుబంధం, అభిమానాన్ని ఓటు గా మారే అవకాశాన్ని పెంచుతుంది.

ఉదాహరణలు: ఎ) వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 పాదయాత్ర.. ఏపీలో పాదయాత్ర ద్వారా గ్రామీణ ప్రజలను, రైతుల ను నేరుగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఈ ప్రత్యక్ష సంబంధం ఆయన నాయకత్వంపై ప్రజల్లో గుర్తింపు, నమ్మకం పెరగడానికి దోహదపడింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం ది. బి) ఎన్టీ రామారావు చైతన్యరథం, 1982 : చైతన్య రథం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు చేరువయ్యారు. ప్రజల మధ్యకు వెళ్లి ప్రసంగించడం ద్వారా తన రాజకీయ సందేశాన్ని విస్తృతంగా తీసుకెళ్లారు. 1983 లో టీడీపీ 201 స్థానాలు గెలుచుకుంది.

7.మద్దతును ఓటుగా మార్చడం కీలకం

ఒక అభ్యర్థిని అభిమానించే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఓటు వేయకపోవచ్చు. అం దువల్ల విజయవంతమైన ప్రచారం ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు, స్పష్టమైన సందేశాన్ని అందించాలి, స్థానిక కార్యకర్తలను సమన్వయం చేయాలి, అర్హులైన మద్దతుదారులు చట్టబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, 2015- అవి నీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పడిన గుర్తింపును స్థానిక సమస్యలు, పార్టీ ప్రచా రం, అభ్యర్థుల పోటీతో అనుసంధానించింది. ఆప్ 70 స్థానాల్లో 67 గెలుచు కుంది. టీఆర్‌ఎస్..- తెలంగాణ ఉద్యమం ద్వారా సంపాదించిన ప్రజా మద్దతును రాష్ట్ర ఎన్నికల్లోకి తీసుకెళ్లింది. 2014లో 63 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

II) అసలైన మైండ్ గేమ్ : ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ వ్యూహకర్త ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. 1) ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి అభిప్రాయాలను ముందుగానే ఊహించకుండా, వాస్తవ పరిస్థితులను తెలుసుకో వాలి. 2) ప్రజలు ఏమి అనుభవిస్తున్నా రు? వారి ఆశలు, అసంతృప్తి, ఆవేదన, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. 3) ప్రజ లు ఎవరిని నమ్ముతున్నారు? అభ్యర్థులు, పార్టీలు, నాయకుల విశ్వసనీయతను అం చనా వేయాలి.

4) ప్రజలు తమ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకుంటారు? నా యకత్వం, కొత్త సమాచారం, అసంతృప్తి, ప్రత్యామ్నాయాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. 5) ప్రజలు ఓటు వేయడానికి ఏ అంశాలు ప్రేరేపిస్తాయి? నమ్మదగిన దృ క్పథాన్ని ఆచరణాత్మక కార్యక్రమాలతో అనుసంధానించాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ, విశ్వసనీయమైన స్థానిక సమాచారం, ని ష్పాక్షిక విశ్లేషణ ద్వారా తెలుసుకోవాలి.

III) డబ్బు, కండ బలం, మీడియా బలంతో ఎన్నికల్లో గెలుపు సాధించలేరు.

ఒక అభ్యర్థి వద్ద అపారమైన డబ్బు ఉండొచ్చు. భారీ సభలు పెట్టొచ్చు. విస్తృత ప్రచారం చేయొచ్చు. అయినా, ప్రజల్లో ఆయన పట్ల అహంకారం, విశ్వసనీయత లోపం లేదా ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉందనే భావన ఏర్పడితే ఓటమి తప్పకపోవచ్చు. అదే సమయంలో, పరిమిత వన రులున్న అభ్యర్థి కూడా ఈఅంశాల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది.

1) స్పష్టమైన, ప్రజలకు అర్థమయ్యే రాజకీయ సందేశం. 2)విశ్వసనీయమైన వ్యక్తిత్వం, స్థిరమైన వైఖరి. 3)స్థానిక ప్రజలతో బలమైన సంబంధాలు. 4)సమర్థవం తమైన కార్యకర్తల వ్యవస్థ. 5)ప్రజల సమస్యలకు పరిష్కారాలను చూపించే వాస్తవిక కార్యక్రమం. డబ్బుతో ప్రచారాన్ని విస్తృ తం చేయొచ్చు. కానీ నమ్మకాన్ని కొనలేరు. ప్రజాదరణతో దృష్టిని ఆకర్షించవ చ్చు; కానీ దానంతటదే ఓట్లను హామీ ఇవ్వదు. తమిళనాడులో విజయ్ విజయం అందు కు ప్రత్యక్ష నిదర్శనం. ఇవన్నీ ఉన్న డీఎంకే పార్టీని ఓడించగలిగాడు. 

IV)బీసీ పోరుకు... వర్తించేనా?

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సా మాజిక న్యాయం సాధించాలనే ఉద్యమానికి ఈ మైండ్ గేమ్ మరింత ప్రాధాన్యత కలిగి ఉంటుంది.ఈ ఉద్యమం ముందున్న ప్రధాన సవాల్ సామాజిక చైతన్యాన్ని సం ఘటిత రాజకీయ భాగస్వామ్యంగా మార్చ డం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మూడు ప్రధాన సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 

హిస్సా- వాటా- : జనాభాకు తగిన ప్రాతినిధ్యం, విద్యా మరియు ఉద్యోగ అవకా శాల్లో న్యాయమైన వాటా, రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం, ఆర్థిక రంగంలోని అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

ఇజ్జత్-గౌరవం : సామాజిక సమాన త్వం, ఆత్మగౌరవం, వివక్ష నుంచి విముక్తి, సమాజంలో గౌరవప్రదమైన స్థానం.

హుకుమత్- అధికారం :- రాజకీయ నిర్ణయాల్లో అర్థవంతమైన భాగస్వామ్యం, పాలనలో వాటా, అధికార వ్యవస్థల్లో తగి న ప్రాతినిధ్యం. ఈ ౩ సూత్రాలను విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అవకాశాలు, ప్రభుత్వ వనరుల పం పిణీ వంటి ప్రజల నిత్యజీవిత సమస్యలతో అనుసంధానించాలి. అదే సమయంలో.. 1.వివిధ బీసీ కులాల మధ్య ఐక్యతను పెంపొందించాలి. ప్రతి కులానికి ఉన్న ప్రత్యేక సమస్యలను గౌరవించాలి. 2.నినాదాలతోనే పరిమితం కాకుండా ఆచరణా త్మక కార్యాచరణ రూపొందించాలి. 3.విశ్వసనీయమైన స్థానిక నాయకత్వాన్ని అభి వృద్ధి చేయాలి.  4.సాధించిన ఫలితాలను ప్రజల ముందు స్పష్టంగా ఉంచాలి. ఈ ఉద్యమం విజయానికి కీలకమైన ప్రశ్న ఏంటంటే  ప్రజలు డిమాండ్ను సమర్థిస్తున్నా రా అన్నది మాత్రమే కాదు. నాయక త్వాన్ని నమ్ముతున్నారా? మార్పు సాధ్యమని భావిస్తున్నారా? సంఘటితంగా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా?

V) చివరిది గెలుపు వ్యూహం 

అవగాహన- : ప్రజల ఆలోచనలు, అవసరాలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవడం. 

సందేశం : -స్పష్టమైన, నమ్మదగిన రాజకీయ దృక్పథాన్ని అందించడం. 

విశ్వాసం : -ప్రజలతో అనుబంధం, విశ్వసనీయతను పెంపొందించడం.

సమీకరణ- : సంస్థాగత బలం, కార్యకర్తల సమన్వయం, ఓటర్ల భాగస్వామ్యం. అవగాహన + విశ్వాసం + సంస్థాగత బలం + ప్రజల భాగస్వామ్యం.. ఇది వ్యూహాత్మక మార్గదర్శకం మాత్రమే,  ఫలితాలను గణితసూత్రంలా నిర్ధారించేది కాదు. చివరగా ఎన్నికలు ఒక రాజకీయ చదరంగం, చదరంగంలో మేధస్సుతో గెలిచినట్లే, ఇక్కడ కూడా గెలవాలి. ఎన్నికలు ఒక మైండ్‌గేమ్. ఓటు వేసేది చేతితోనే అయినా, ఎవరికీ  వేయాలని చెప్పేది మనసు. ఎన్నికల్లో గెలవడం ఒక విజయం. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని, సమర్థవంతమైన పాలన అందించడం అంతకంటే గొప్ప విజయం. ఇన్నాళ్లూ న్యాయం కోసం వ్యవస్థల తలు పులు తట్టినా న్యాయం దక్కలేదు. ఇక ఆ తలుపులను బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చింది. 

బలం, బలగం ఉన్నా ఎన్నికల్లో వ్యూహం కూడా కీలకమే..

ధనం, పలుకుబడి, కండ బలం, మీడియా అండ ఉన్నప్పటికీ ఒక అభ్యర్థిపై అసంతృప్తి, అతనిపై విశ్వాసం, ప్రజల సమస్యలపై అతనికి నిర్లక్ష్యం ఉందనే భావన ఓటర్లలో కలిగితే.. ఆ ఎన్నికల్లో అతనికి ఓటమి తప్పకపోవచ్చు. అదే సమయంలో పరిమిత వనరులున్న అభ్యర్థిని విజయం వరించే అవకాశం దక్కవచ్చు. విపరీతమైన వనరులున్నప్పటికీ భారీ సభలు, సమావేశాలు నిర్వహించినప్పటికీ, పోటీదారులకంటే ఎక్కువగా ప్రచారం చేసినప్పటికీ ఓటర్లను ఆకట్టుకోవడంలోవ్యూహాలు విజయాలకు బాటలు వేస్తాయి. ప్రజల అవసరాలు, వారి ఆలోచనలకు అనుగుణంగా వాగ్దాన పూరిత ప్రసంగాలతో ఆకర్షించడం, స్పష్టమైన, నమ్మదగిన విశ్వాసాన్ని ఓటర్లలో పెంపొందించడం, అనుచరుల భాగస్వామ్యం లాంటి ప్రణాళికలు గెలుపునకు బాటలు వేసే అవకాశం ఏర్పడవచ్చు.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్

మరిన్ని వార్తలు