ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంచాలి
నామినేషన్లు వేసే నాటిదాకా అవకాశం ఇవ్వాలి
సీఈఓను కోరిన టీఆర్‌ఎస్ అధినేత్రి కవిత
పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) ఓటరు నమోదు గడువు పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కేఆర్ భవన్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి చీఫ్ సీ సుదర్శన్ రెడ్డిని(Sudarshan Reddy) కలిసి ఓ వినతిపత్రం అందజేశారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు ఈనెల 6వ తేదీతో ముగుస్తున్నదని.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ కొనసాగేవరకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సీఈవోను కలిసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఈ నెల 21 వరకు కొనసాగుతుందని, గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు ఈనెల 6వ తేదీతో గడువు ముగిసిపోతుందని పేర్కొనడం సమంజసం కాదన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు పొడగించాలని సీఈవోను కోరినట్లు తెలిపా రు. తమ లాంటి కొత్త పార్టీలకు తమ ఎజెండాను చెప్పుకోవడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమని పేర్కొన్నారు.
జెన్ జీలు, గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికలను సీ రియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గ్రాడ్యుయేట్ ఓ టరు నమోదు ప్రక్రియ.. పోటీ చేసే అభ్యర్థులకు తలకుమించిన భారంగా మారుతున్నదని, ఈ ప్రక్రియ మార్పునకు ఎన్నికల కమిషన్ ను కోరుతామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో పెద్ద విద్యాసంస్థల యజమానులు పోటీకి దిగుతుండటం.. వారి విద్యాసంస్థల్లో నే పెద్దఎత్తున ఓటరు నమోదు చేస్తుండ టంతో ఎ న్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని.. వీటిపైనా ఈసీ దృష్టి సారించాలన్నారు.
పార్టీ రిజిస్ట్రేషన్‌కు సహకరించండి..
తమ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో తమ కు సహకరించాలని సీఈవోను కోరినట్లు కవిత చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా ప్రజా సమస్యలపై పోరాడు తున్న తమ తీరును నివేదిక రూపంలో కేం ద్ర ఎన్నికల సంఘానికి అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ అన్ని విభాగాల కమిటీలు ఏ ర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తు న పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని సీఈవోకు వివరించినట్లు వెల్లడించారు.