చాణక్య టీజర్ లాంచ్
03-11-2026 | 05:35am
రాజేశ్వర శర్మ(Rajeshwara Sharma) స్వీయ నటనా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘చాణక్య(Chanakya)’. ఇందులో వైభవ్ తదితరులు నటించనున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్(Movie Teaser Launched) ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రహ్లాదాచార్యులు, నాగరాజు సోమిశెట్టి కలిసి చాణక్య టీజర్‌ను లాంచ్ చేశారు. ఇదే వేదికపై ఎస్‌ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో, ‘జనపదం జానపదం’ లోగోను ఆవిష్కరించారు. నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, నరసింహ, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్ గార్లపాటి, నటుడు ఘర్షణ శ్రీనివాస్ తాండవం అతిథులుగా పాల్గొన్నారు.