రైతన్నకు భరోసా ఏది?

29-10-2026 | 05:05am

పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని వాన చుక్కల కోసం! బీటలు వారిన భూమిలో విత్తనం విలవిల.. ఎండి న బోర్లతో బిందె పట్టిన తల్లి ఎదురుచూపులు! పంట లేదు.. పనిలేదు.. పొయ్యిలో పిడికెడు బువ్వ లేదు.. అప్పుల బాధతో రైతన్న(Former)కు కంటిమీద కునుకు లేదు! చినుకమ్మ రాక కోసం పల్లె ప్రాణం తపిస్తుంటే.. పాలకులారా.. అన్నదాత ఆర్తనాదం ఆలకించరా! ఎండిన పంటకు పరిహారమిచ్చి.. దాహంతో అల్లాడే పల్లెకు నీరందించరా! పనులు కోల్పోయిన కూలీలకు ఉపాధి కల్పించి.. రైతు కుటుంబాలకు అండగా నిలవరా! కరువు కాటుకు బలికాకముందే ప్రభుత్వం ఆదుకోవాలి.. కన్నీటి పల్లెల్లో మళ్లీ ఆశల వాన కురిపించాలి!. ఒకప్పుడు చెరువు నిండితే పల్లె కళకళలా డేది.

బావిలో నీరుంటే రైతు ముఖంలో వెలుగు కనిపించేది. నేడు ఆకాశం వైపు ఆశగా చూసే అన్నదాతకు వర్షాభావం శాపంగా మారుతోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమం దుల కోసం చేసిన అప్పులు ఒకవైపు.. పం ట చేతికి వస్తుందో లేదోనన్న ఆందోళన మరోవైపు రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వర్షాభావం ప్రకతి పరిస్థితి కావొచ్చు.. కానీ దాని దెబ్బకు ప్రజలు కుంగిపోకుండా కాపాడటం పాలన బాధ్యత.

తెలంగాణ(Telangana)లో కరువు తీవ్రతను గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రాష్ర్టంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 111 మండలాలు తీవ్ర కరువు, 254 మండలాలు మధ్యస్థ కరువు బారినపడ్డాయి. జూన్ 1నుంచి సెప్టెంబరు 30 వరకు సాధారణ వర్షపాతం 740.6 మి.మీ. కాగా, 615.5 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే 17 శాతం లోటు. ఈ కొరత వర్షపు చుక్కల్లోనే కాదు.. ఎండిన పంటల్లో, తగ్గిన నీటిమట్టా ల్లో, పెరిగిన అప్పుల్లో కనిపిస్తోంది.

వర్షాభావం సాగు విస్తీర్ణంపైనా ప్రభావం చూపింది. వానాకాలం సీజన్‌లో గతంలో 139.28 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి 126.06 లక్షల ఎకరాలకు తగ్గిన ట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. వరి సాగు విస్తీర్ణం 69.19 లక్షల ఎకరాల నుంచి 57 లక్షల ఎకరాలకు పడిపోయిం ది. ఈ తగ్గుదల వెనుక నీటి కొరతతోపాటు పెట్టుబడి నష్టాల భయాలూ ఉన్నా యి. సాగు చేస్తే పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకం లేకపోతే రైతు పొలంలో అడుగు పెట్టడానికే వెనుకాడతాడు.

ఎల్ నినో వంటి సముద్ర --వాతావరణ పరిణామాలు కొన్ని పరిస్థితుల్లో వర్ష పాతంపై ప్రభావం చూపగలవు. అయితే తెలంగాణలోని ప్రస్తుత కరువుకు ఎల్ నినో ఏకైక కారణమని నిర్ధారించడం సరికాదు. వర్షపాతం లోటు, ప్రాంతాలవారీ వర్షాల పంపిణీ, జలాశయాల నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, సాగు విధానాలు.. ఇలా అనేక అంశాలు వ్యవసాయా న్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఎల్ నినో గురించి చర్చించడంతో పాటు, వాతావరణ అంచనాల ఆధారంగా ముం దస్తు ప్రణాళికలు రూపొందించడం అత్యవసరం. ప్రకృతి ఎప్పుడు ఎలా మారు తుందో మనిషి నిర్ణయించలేడు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతును సిద్ధం చేయగలడు. 

కరువు ప్రభావం పొలంలోనే ఆగిపోదు. పంట చేతికి రాకపోతే రైతు ఆదాయం తగ్గుతుంది. రైతు ఖర్చు చేయలేకపోతే కూలీకి పని ఉండదు. పల్లెల్లో కొను గోళ్లు తగ్గితే చిన్న వ్యాపారులూ నష్టపోతారు. పశువులకు మేత, నీరు దొరకకపోతే పాడి రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది. పిల్లల చదువులు, కుటుంబ వైద్యం, ఇంటి అవసరాలన్నీ ఆర్థిక భారంగా మారతాయి.

ఒక పంట నష్టం క్రమంగా కుటుంబ సమస్యగా, అక్కడి నుంచి గ్రామీణ ఆర్థిక సం క్షోభంగా మారుతుంది. అందుకే కరువును వ్యవసాయ శాఖ సమస్యగా మాత్రమే చూడకూడదు. వ్యవసాయం, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖలు సమన్వయంతో పనిచేయాలి. జలాశయాల్లో నీటి నిల్వలూ ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రధాన, మధ్యతరహా జలాశయాల్లో కలిపి 585 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను 179.63 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరిస్థితిలో తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. నీటి లభ్యతను బట్టి పంటల ఎంపికపై రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలి. తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడంతోపాటు, వాటికి గిట్టుబాటు ధర, కొనుగోలు భరోసా కల్పించాలి. లేకపోతే ప్రత్యామ్నాయ పంట వేయమనే సూచన రైతుకు మరో ఆర్థిక ప్రయోగంగా మిగిలిపోతుంది.

ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలివీ..

పంట నష్టం అంచనా : క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పారదర్శకంగా నమోదు చేసి, అర్హులైన రైతులను గుర్తించాలి.

పరిహారం, పెట్టుబడి సాయం : అర్హుల జాబితాలను బహిరంగపరిచి, సకాలంలో రైతుల ఖాతాల్లో సాయం జమ య్యేలా చూడాలి.

తాగునీటి భరోసా : ఎండిపోయిన బోర్లు, నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏరాట్లు చేయాలి.

కూలీలకు ఉపాధి : వ్యవసాయ పను లు తగ్గిన గ్రామాల్లో ఉపాధిహామీ పనులను వేగవంతం చేయాలి.

పశువుల సంరక్షణ : పశుగ్రాసం కొరత ఏర్పడిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలి.

కేంద్ర సాయం కోసం సమన్వయం : కరువు నష్టాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి, కేంద్రం నుంచి అందాల్సిన సహాయాన్ని త్వరగా పొందేందుకు చర్యలు తీసుకోవాలి.

తదుపరి పంటకు ప్రణాళిక : వాతావరణ అంచనాలు, నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళిక, విత్తనాల లభ్యత, గిట్టుబాటు ధరపై ముందస్తు చర్యలు తీసుకో వాలి.

కరువు మండలాల ప్రకటన తొలి అడుగు మాత్రమే. కేంద్రం నుంచి సాయం కోరడం, నష్టాన్ని అంచనా వేయడం ముఖ్యమే. కానీ, ఆ సాయం అర్హులైన రైతులకు ఎప్పుడు చేరుతుంది? నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు తాగునీరు ఎప్పుడు అం దుతుంది? పని కోల్పోయిన కూలీకి ఉపా ధి ఎప్పుడు దొరుకుతుంది? ఈ ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో సమాధానాలు కనిపించాలి. పరిహారం కోసం రైతు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. కేంద్రం, రాష్ర్టం బాధ్యతను ఒకరిపై మరొకరు నెట్టకుండా సమన్వయంతో పనిచేయాలి.

కరువు వేళ రైతుకు కావాల్సింది ఓదార్పు మాటలు మాత్రమే కాదు. చేతికి సాయం, పొలానికి నీరు, కుటుంబానికి ఉపాధి, పశువులకు మేత, పంటకు గిట్టుబాటు ధర. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో మని షి నిర్ణయించలేడు. కానీ, వర్షాభావం వచ్చినప్పుడు ప్రజల నష్టం తగ్గించే చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల చేతిలోనే ఉంది. కరువు ముందస్తు హెచ్చరికలను కార్యాచరణగా మార్చి, సాయం అర్హుల చేతికి చేర్చి, పల్లె బతుకుల్లో భరోసా కల్పించినప్పుడే పాలన తన పరీక్షలో నెగ్గినట్లు!. 

వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్టు (9133947176)

శ్రీశైలం దూడం

మరిన్ని వార్తలు