ఢిల్లీ తరలిన అంగన్వాడీ టీచర్లు

29-11-2026 | 03:03pm

కాజీపేట: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ నవంబర్ 1 నుండి 3 వరకు చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహబూబాబాద్ జిల్లా నుండి అంగన్వాడీ టీచర్లు(Anganwadi Teachers) ఢిల్లీ బయలుదేరారు. సీఐటియు అధ్యక్ష కార్యదర్శులు కందునూరు శ్రీనివాస్, సమ్మెట రాజమౌళి, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి గుండు సులోచన, అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ ఆధ్వర్యంలో వందమందికి పైగా రైలులో బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా కాజీపేట రైల్వే స్టేషన్లో వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి79   సంవత్సరాలు పూర్తి అయినా కార్మికులకు కనీసవేతనాలు ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పగిడి పాల తిరుపతమ్మ, కుమ్మరి కుంట్ల జ్యోతి, లలిత, జ్యోతి,ఉమా, మంజుల,లీల బాయ్, విజయ, భారతి,సరిత, పద్మ, చంద్రకళ,శ్రావణి, కవిత,ఆండాలు,భాగ్య, ఇందిర,వినోద,తదితరులు పాల్గొన్నారు.  

 

.

మరిన్ని వార్తలు