రాజ్యాంగ స్ఫూర్తితోనే సమానత్వ సాధన.
కరీంనగర్, నవంబర్ 30 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వరుసగా ఐదో ఆదివారం ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అధికార, అనధికార వ్యవస్థలు శాస్త్రీయంగా కొనసాగడానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం (Indian Constitution) స్ఫూర్తే కారణమన్నారు. దేశ ప్రజల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం (Equality and Fraternity) పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావాలంటే రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారానే ఈ లక్ష్యాలను సాధించవచ్చని అంబేద్కర్ దూరదృష్టి దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొంపెల్లి రామన్, చిగిరి శ్రీధర్, పెద్దల్లి శేఖర్, తాళ్ల వెంకటేష్, సోముడి మురళి, బత్తుల కనకరాజు, కొంపెల్లి రవీందర్, పాటకుల భూమయ్య, ఎడ్ల రాంకుమార్, మాడెపు నరసయ్య, మండిగ మాణిక్యరావు, కొత్తపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.