ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం

29-11-2026 | 02:56pm

జగిత్యాల, నవంబర్ 29 (విజయక్రాంతి): డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత  రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అవగాహనా చేసుకొని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు దుమాల గంగాధర్(Dumala Gangadhar) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో  ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ సంఘం నాయకులు దుమాల గంగాధర్ పాల్గొని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి  పూల మాలతో ఘన నివాళ్లను అర్పించి మహానుభావుని సేవలను స్మరించారు. 

అంబేద్కర్ సంఘం నాయకులు దుమాల గంగాధర్ మాట్లాడుతూ... అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే పీడిత వర్గాలు అన్ని అడవుల్లో పశువుల కాపరులుగా మిగిలి పోయేవారని అన్నారు. ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించాగానే ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళుటకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులను సాధించుకొనుటకు ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం యువత చెడు మార్గంలో ప్రయాణిస్తూ విలువలు, ఆశయలు లేకుండా జీవితం కొనసాగించడం ఆందోళన కలిగించే అంశామన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల కంటే అంజయ్య, ముద్దమల్ల ప్రవీణ్ కుమార్, రుద్ర మనోహర్, బొల్లం ప్రభాకర్, కంచి సురేష్, నల్ల సురేష్, దాసరి ప్రవీణ్, తదితరులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు