బుద్ధారం భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, అక్టోబర్ 14 (విజయ క్రాంతి): బుద్ధారం గ్రామంలో భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో భూసేకరణ, భూముల గుర్తింపు, పునఃసర్వే పనులపై సమీక్ష నిర్వహించారు.
రామప్ప నుండి నీటిని తరలించి ఎనిమిది మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ నెల 15లోగా అవసరమైన మేరకు భూముల గుర్తింపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.