పోలీస్ కమిషనర్ ను కలిసిన పదోన్నతి పొందిన ఎస్సైలు
హనుమకొండ, నవంబర్ 20 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate) పరిధిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా(Assistant Sub-Inspectors) (ఏఎస్ఐలు) విధులు నిర్వహిస్తూ, సబ్-ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్‌ఐలు) పదోన్నతి పొందిన అధికారులు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(Warangal Police Commissioner N. Shweta) ను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన వారిలో టి.కమల, ఎం.రాజేందర్, ఏ.సగాయమ్మ, వై.కాసులు, కె.పద్మ, ఎన్.లక్ష్మి, కె.సంతోష, సి. హెచ్.పద్మ ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ నూతనంగా పదోన్నతి పొందిన ఎస్‌ఐ లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు(Police Department) మంచి పేరు తీసుకురావాలని సూచించారు.