ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ
ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల హక్కుల సాధన కోసమే డిసెంబర్ 27న భారీ బహిరంగ సభ
ఆకుబత్తిని విజయ్ కుమార్
చిగురుమామిడి, నవంబర్20(విజయక్రాంతి): డిసెంబర్ 27న కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల భారీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను చిగురుమామిడి మండల(Chigurumamidi Mandal) కేంద్రంలో కరీంనగర్ జిల్లా(Karimnagar District) ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు ఆకుబత్తిని విజయ్ కుమార్(Akubatti Vijay Kumar) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో(Development of Gram Panchayats) కీలక పాత్ర పోషిస్తున్న ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం, హక్కులు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా తమకు రావాల్సిన హక్కులు, అధికారాలు సాధించుకునే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 27న కరీంనగర్‌లో జరిగే ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆకుబత్తిని విజయ్ కుమార్‌ను స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి ఉపసర్పంచ్ హరీష్, చిగురుమామిడి ఉపసర్పంచ్ విజయ , పలువురు వార్డు సభ్యులు అనిల్ కుమార్. శివంజనేయులు. సమ్మన్న. అనిల్.తదితరులు పాల్గొన్నారు.