సాయిబాబా సేవలో మంత్రి పొంగులేటి దంపతులు
20-11-2026 | 10:35pm
సత్తుపల్లి. నవంబర్ 20. ( విజయక్రాంతి ): ఈరోజు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తన సతీమణితో కలిసి మహారాష్ట్రలోని(Maharashtra) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించి, శ్రీ షిరిడీ సాయిబాబాను(Shirdi Sai Baba) దర్శించుకుని మధ్యాహ్న హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు మంత్రి పొంగులేటి దంపతులకు సాయిబాబా ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు.