ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

20-11-2026 | 10:06pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ(District Medical and Health Department) అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్(Dr. Narender Rathod) ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీపక్ నగర్  అర్బన్ ప్రాథమిక కేంద్రాన్ని కూడా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(Primary Health Center) వైద్యులు వైద్య సిబ్బంది(Doctors and medical staff) అందుబాటులో ఉండాలి, సమయపాలన పాటించాలి ప్రతి ఒక్కరూ ఉద్యోగులు  ప్రమాణం హాజరులో నమోదు చేసుకోవాలి సూచించారు.  ప్రమాణంలో నమోదు చేసుకున్న వారి వివరములు రోజువారీగా జిల్లా కలెక్టర్, కమిషనర్ కు పంపిస్తామని తెలిపారు.

అదేవిధంగా ఈ రెండు ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో(Vaccination Program) వాక్సినేషన్ నిలువలను పరిశీలించారు. ప్రతి బుధ, శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది(Healthcare personnel) ముందుగానే పిల్లల వివరాలను సుప్రవైజర్లు ఆయా ఉప కేంద్రంలోవ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించాలనీ తెలిపారు.100% గర్భవతుల నమోదు గర్భవతులందరికీ పరీక్షలు చేయించడం ముఖ్యంగా ఐరన్ ఫోలిక్ మాత్రలను అందించాలన్నారు. వివరాలు మాతా శిశు సంరక్షణ పోర్టల్ లో నమోదు తప్పనిసరిగా చేయాలనీ సూచించారు.

హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా టార్గెట్ 14 సంవత్సరములు నిండిన బాలికలనీ చెప్పారు. వాటి సమాచారం కూడా నమోదు చేయాలన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం సాధారణ ప్రసవాలు ముద్దు సిజేరియన్లు వద్దు అనే నినాదంతో ప్రచారం చేయాలన్నారు. సి సెక్షన్ తగ్గించాలనీ దీని కోసం తల్లులకు గర్భవతులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ సంజీవని కార్యక్రమంలో భాగంగా 100%  రోగులు,  మందులు, మందుల నిలువలను నమోదు చేయాలన్నారు.

జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం పిల్లల్లో కుష్టు వ్యాధిగ్రస్తుల వారి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. వారికి సరైన మందులను పిల్లల వైద్య నిపుణులకు చూయించి పోర్టల్ లో నమోదు చేయించాలనీ చెప్పారు. అనంతరం  కాశీపేట, దీపక్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య కార్యకర్తలతో అసంక్రమణ వ్యాధుల నమోదు, గుర్తింపు మందులు అందజేయడం పైన సమీక్ష చేశారు.

జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రతి వారం కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి ముందే తమ టార్గెట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కాసిపేట డాక్టర్ దివ్య, డాక్టర్ రేవంత్,డాక్టర్ అనిల్, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జాహ్నవి, వైద్య సిబ్బంది జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు