పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా
సర్పంచ్ సోక్కం లావణ్య
సాలూర, నవంబర్ 20(విజయక్రాంతి) : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా(Financial Security) కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా(Indiramma Family Life Insurance)’ పథకాన్ని సాలూర మండల కేంద్రంలో సర్పంచ్ సొక్కం లావణ్య రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా రూ.5 లక్షల జీవిత బీమా(Life Insurance) సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
స్వర్గీయ ఇందిరా గాంధీ(Indira Gandhi) జయంతి సందర్భంగా నవంబర్ 19న ప్రారంభమైన ఈ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో(Rural and urban areas) ప్రజలకు అందుబాటులో ఉండేలా శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు(Applications) స్వీకరిస్తున్నట్లు చెప్పారు. వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డు ప్రతిని ప్రాతిపదికగా తీసుకుంటారని, అర్హులైన ప్రతి ఒక్కరూ సమీపంలోని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బండి నర్సయ్య, పీఏసీఎస్ చైర్ పర్సన్ అల్లే రమేష్, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంటె లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చల్వార్ రవి, నాయకులు సోక్కం రవి, బాగే శ్రీకాంత్, అల్లే జనార్దన్, ఈవో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.